హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగంలో ఫైనల్ టెస్ట్ కు సిద్దమైన అమెరికా

by Ramesh Goud |   ( Updated:2025-04-06 17:29:26.0  )
హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగంలో ఫైనల్ టెస్ట్ కు సిద్దమైన అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్: లాంగ్-రేంజ్ హైపర్‌సోనిక్ వెపన్ (Long-Range Hypersonic Weapon) ఫైనల్ టెస్ట్‌ (final test)ను ప్రయోగించేందుకు అగ్రరాజ్యం అమెరికా (America) సిద్దమైంది. ఈ పరీక్షను ఈ డిసెంబర్ లో నిర్వహించేందుకు యూఎస్ ఆర్మీ (US Army) కసరత్తులు చేస్తోంది. హైపర్ సోనిక్ ఆయుధాలు ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్ (game changer) గా పరిగణించబడుతున్నాయి. ఈ ఆయుధ సంపత్తి కలిగిన వాటిలో ఇప్పటికే రష్యా (Russia), చైనా (China) దేశాలు చోటు సంపాదించుకున్నాయి. వాటి సరసన చేరేందుకు ఇప్పుడు అమెరికా కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

అమెరికా తన మొదటి హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థ (hypersonic missile system)లో భాగంగా పిలిచే లాంగ్-రేంజ్ హైపర్‌సోనిక్ వెపన్ (LRHW) మొదటి పరీక్షను ఇప్పటికే విజయవంతం చేసింది. ఇప్పుడు చివరి సారి పరీక్షించేందుకు కూడా సిద్దమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, అమెరికా ఈ ఆధునాతన ఆయుధాన్ని వాస్తవ ప్రపంచంలో వినియోగంలోకి తీసుకురావడంలో చైనా, రష్యాలతో కలుస్తుంది. ఇక ఈ వెపన్ ముద్దుపేరును డార్క్ ఈగిల్ (Dark Eagle) గా యూఎస్ నామకరణం చేసింది. ఈ లాంగ్-రేంజ్ హైపర్‌సోనిక్ వెపన్ అనేది దాని హైపర్‌సోనిక్ గ్లైడ్ బాడీని ఉపయోగించుకొని, ఒక ట్రక్కు ద్వారా బూస్టర్ ను ప్రయోగించగలదు.

ఇది మాక్ 5 (ధ్వని వేగం కంటే 5 రెట్లు) కంటే ఎక్కువ వేగంతో 1,700 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదని, శత్రు సైన్యాలను నివారించడానికి నిర్ధేషించిన ఎత్తులో వేగంగా ఎగరగలదని యూఎస్ ఆర్మీ తెలిపింది. అంతేగాక దీని పేలోడ్ సామర్థ్యం అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలదని తెలిసింది. 2024లో దీని మొదటి పరీక్ష మంచి ఫలితాలను చూపించినప్పటికీ, దీనిపై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవ పరిస్థితులలో ఇది ఎలా పని చేస్తుందనే దాని గురించి ఎక్కువ సమాచారాన్ని యూఎస్ ఆర్మీ వెల్లడించలేదు. దీంతో ఈ ప్రయోగం చేసేందుకు నిజంగా అమెరికా సిద్ధంగా ఉందా అనే ప్రశ్నలను సైన్స్ నిపుణులు లేవనెత్తుతున్నారు.



Next Story

Most Viewed