Amith Sha : బస్తర్ పర్యటనకు అమిత్ షా

by M.Rajitha |
Amith Sha : బస్తర్ పర్యటనకు అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్ : వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) దద్దరిలుతున్న వేళ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) బస్తర్(Bastar) పర్యటనకు సిద్ధమయ్యారు. ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ రీజియన్ లోని దంతెవాడలో అమిత్ షా పర్యటనకు సర్వం సిద్ధం అయింది. ఈనెల 5న దంతెవాడకు చేరుకొని, అక్కడ గల దంతేశ్వరి అమ్మవారిని అమిత్ దర్శించుకుంటారు. అనంతరం నక్సల్స్ నిరోధక ఆపరేషన్స్ లో పాల్గొంటున్న భద్రతా బలగాల కమాండర్లతో ఆయన భేటీ కానున్నారు. ఆపరేషన్ కగర్(Oparetion Kagar) ను మరింత ఉధృతం చేసేందుకు వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఆపరేషన్స్ లో పాల్గొంటున్న భద్రతా బలగాలను నేరుగా కలిసి వారిలో స్థైర్యాన్ని నింపనున్నారు.

ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా బస్తర్ పర్యటనప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆపరేషన్ కగర్ పేరుతో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను ఏరి పారేస్తామని అమిత్ షా ప్రకటించారు. గత ఏడాది మొదలైన ఆపరేషన్ కగర్ లో ఇప్పటి వరకు భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అలాగే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.



Next Story

Most Viewed