Baba siddique murder case : బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-10 19:37:25.0  )
Baba siddique murder case : బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన వారిలో ఒకరిని యూపీలోని బహ్రెచ్‌లో ముంబై పోలీసులు అదివారం పోలీసులు పట్టుకున్నారు. సిద్ధిఖీపై కాల్పులు జరిపిన శివకుమార్ నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నాన్ పారాలో అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నెల రోజుల నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనికి ఆశ్రయం కల్పించి నేపాల్ కు పారిపోయేందుకు సహకరించినందుకు గానూ ముంబై క్రైమ్ మరో నలుగురిని అరెస్ట్ చేసింది. నలుగురిని అనురాగ్ కశ్యప్, జ్ఞాన్ ప్రకాష్ త్రిపాఠి, ఆకాష్ శ్రీవాస్తవ, అఖిలేశేంద్ర ప్రతాప్ సింగ్‌లు‌గా పోలీసులు గుర్తించారు.

శివకుమార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో పనిచేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. కెనడాలోని అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకు తాను పనిచేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. విచారణ బృందంలో మొత్తం ఆరుగురు ఆఫీసర్లు 15 మంది సభ్యులు ఉన్నారు. శివకుమార్‌తో పాటు నిందితులను పోలీసులు ముంబైకి తరలించనున్నారు. లక్నోలోని శివకుమార్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోలీసులు నెల క్రితం వెళ్లారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించారు. శివకుమార్ ఎలాంటి ఆధారాలు దొరకుండా ఆమెకు ఫోన్ చేయడం ఆపేశాడు. పాత సిమ్‌ను సైతం ధ్వంసం చేశాడు. అయితే ఈ కేసులో ఆమె ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు.

Advertisement

Next Story