- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cuba: క్యూబాలో భారీ భూకంపం
దిశ, నేషనల్ బ్యూరో: క్యూబాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం తూర్పు క్యూబాలో వచ్చిన భూకంపం 6.8 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో డి క్యూబాలోని భవనాలు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు వణికిపోయాయి. ఈ భూకంపం తమ జీవితం కాలంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెప్పినట్టు రాయిటర్స్ పేర్కొంది. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు తీవ్రంగా కంపించాయని వారు చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంతమేర ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి గంట ముందు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత దాన్ని సవరించారు. 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 14 కిలోమీటర్ల లోతులో జరిగినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ ఘటనల కారణంగా తూర్పు క్యూబాలోని చాలా ప్రాంతం విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొన్నదని, కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తాయని అధికారులు వెల్లడించారు.