- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో గెలిచేదెవరు? ట్రైబల్ సీట్లపై బీజేపీ గురి
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్(Bihar) నుంచి విడిపోయి 2000లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్(Jharkhand) రాష్ట్రంలో ఎక్కువ కాలం రాజకీయ అనిశ్చితి నెలకొనే ఉన్నది. ఈ 14 సంవత్సరాల్లో 13 సార్లు ముఖ్యమంత్రులు మారారు. మూడు సార్లు రాష్ట్రపతి పాలన సాగింది. ఐదేళ్లు పూర్తి చేసిన ఏకైక సీఎం రఘుబర్ దాస్ సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత సిట్టింగ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemant Soren) అత్యధిక కాలం ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి మొదటి నుంచీ పట్టుంది. 2000 నుంచి బీజేపీనే 13 ఏళ్లు అధికారంలో ఉన్నది. కానీ, బీజేపీ గిరిజన వ్యతిరేక విధానాలు చేపడుతున్నదన్న అసంతృప్తి బయల్దేరడం జేఎంఎం(JMM)కు కలిసి వచ్చింది. గిరిజనుల హక్కులను కాపాడే పార్టీగా జేఎంఎం ఒక సింబల్ సృష్టించుకుంది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో అధికార పార్టీ జేఎంఎంకు ఇది చాలా కలిసి వస్తున్నది. బీజేపీకి ఇదే పెద్ద మైనస్‌గా ఉన్నది.
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. ఈ నెల 13న తొలి విడతలో భాగంగా 43 సీట్లు, రెండో విడతగా 20వ తేదీన 38 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ప్రచారం నేటి సాయంత్రానికి ముగియనుంది. ఫలితాలు 23వ తేదీన వెలువడుతాయి. మొత్తం 81 స్థానాల్లో 9 ఎస్సీ రిజర్వ్డ్, 29 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ సారథ్యంలో ఏజేఎస్‌యూ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీయే కూటమిగా బరిలో దిగగా.. కాంగ్రెస్ సారథ్యంలో జేఎంఎం, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ 30 స్థానాల్లో జేఎంఎం 43 స్థానాల్లో ఆర్జేడీ ఆరు, వామపక్ష పార్టీలు మూడు సీట్లల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 68 సీట్లు, ఏజేఎస్‌యూ 10 స్థానాలు, జేడీయూ రెండు స్థానాల్లో లోక్ జనశక్తి పార్టీ ఒక్క స్థానంలో పోటీ చేస్తున్నాయి. జార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.31 పురుషులు, 1.29 మహిళలు ఉన్నారు. కొత్త ఓటర్లు 11.84 లక్షల మంది ఉన్నారు.
గత ఫలితాలు:
2014లో ఏజేఎస్‌యూతో పొత్తులో బీజేపీ బరిలోకి దిగి మంచి ఫలితాలను సాధించుకుంది. బీజేపీ 37, ఏజేఎస్‌యూ 5 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తొలిసారి గిరిజనేతర నాయకుడైన రఘుబర్ దాస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో జేఎంఎం 19 సీట్లు, కాంగ్రెస్ 6, జేవీఎం(పీ) 8 స్థానాలకు పరిమితం అయ్యాయి. 2015లో ఆరుగురు జేవీఎం(పీ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 2020లో బీజేపీలో విలీనమైంది. 2019లో బీజేపీ సొంతంగా బరిలోకి దిగింది. పొత్తు లేకపోవడంతో బీజేపీ, ఏజేఎస్‌యూ రెండూ నష్టపోయాయి. బీజేపీ 25 సీట్లు, ఏజేఎస్‌యూ 2 సీట్లు గెలుచుకున్నాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి. జేవీఎం 3, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. జేఎంఎం పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసింది.
గిరిజన సీట్లపైనా గురి
రాష్ట్రంలో 28 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లల్లో జేఎంఎం బలంగా ఉన్నది. ఈ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నది. శిబూసోరెన్ కుటుంబం నుంచి వచ్చిన చంపయి సోరెన్, సీతా సోరెన్‌లు బీజేపీలోకి రావడం కమల దళానికి కలిసిరానుంది. జేఎంఎంలో నెంబర్ 2గా ఉన్న చంపయి సోరెన్ సీఎంగా కూడా స్వల్పకాలం చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. శిబూ సోరెన్ కోడలు సీతా సోరెన్ కూడా గిరిజనుల ఓట్లను కొల్లగొట్టడంలో బీజేపీకి ఉపకరించనున్నారు. ఈ ఎన్నికల్లో ఏజేఎస్‌యూతో పొత్తు బీజేపీకి సత్ఫలితాన్ని అందించే అవకాశం ఉన్నది. గిరిజన నేత అర్జున్ ముండా జార్ఖండ్ బీజేపీకి నాయకత్వం వహించడం గిరిజనుల్లో కొంత సానుకూలత పెంచుకోవడానికి దోహదపడుతున్నది. వీటికితోడు బీజేపీ అగ్రనాయకులు సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు.
ఇక అధికార పక్షం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఎక్కువగా ప్రచారం చేస్తున్నది. దళిత, గిరిజనుల పక్షాన నిలబడే పార్టీలు తమవేనని కాంగ్రెస్, జేఎంఎంలు బలంగా చెప్పుకుంటున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు కూడా కలిసిరానుంది. రాజకీయాల్లో కుట్రతోనే అరెస్టు చేశారనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్నది. హేమంత్ అరెస్టు తర్వాత ఆయన భార్య రాజకీయాల్లోకి వచ్చి ఉపఎన్నిక గెలవడం అధికార పక్షానికి నైతికంగా ధైర్యాన్ని ఇస్తుండగా ఎన్డీయే కూటమిని ఇబ్బంది పెడుతున్నది.