- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Census: జనగణనలో ఈ ప్రశ్నలు చేర్చండి.. అమిత్ షాకు విజయసాయిరెడ్డి రిక్వెస్ట్
దిశ, వెబ్ డెస్క్: జనగణన(Census)లో కులగణన(Caste Census)పై రెండు లేదా మూడు ప్రశ్నలు చేర్చాలని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి(YCP leader Vijayasai Reddy) కోరారు. జనగణనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah)ను కీలక రిక్వెస్ట్(Request) చేశారు. ఈ సందర్భంగా.. రాబోయే సాధారణ జనాభా గణనలో సామాజిక-ఆర్థిక కుల గణన(Socio-Economic Caste Census) (SECC)ని చేర్చాలని అమిత్ షాను కోరారు. కేవలం రెండు లేదా మూడు ప్రశ్నలను జోడించడం ద్వారా, ఈ ఏకీకరణను సజావుగా, సమర్ధవంతంగా సాధించవచ్చని తెలిపారు. సెన్సస్‌తో పాటు సామాజిక-ఆర్థిక కుల గణన నిర్వహించడం వల్ల సమయం, వనరులు ఆదా అవుతాయని సూచించారు. అలాగే దీని వల్ల సామాజిక-ఆర్థిక వాస్తవాల(Socio-Economic Realities)ను బాగా అంచనా వేయడానికి.. తదుపరి లక్ష్యాలను, భవిష్యత్తు కేంద్రీకృత విధానాలను ప్లాన్ చేయడానికి ప్రభుత్వాలకు కూడా అధికారం లభిస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.