Dog Missing :పెంపుడు కుక్క ఆచూకీ చెబితే.. రూ.50వేల బహుమానం

by Hajipasha |   ( Updated:2024-11-10 19:33:27.0  )
Dog Missing :పెంపుడు కుక్క ఆచూకీ చెబితే.. రూ.50వేల బహుమానం
X

దిశ, నేషనల్ బ్యూరో : తమ పెంపుడు కుక్క(Pet Dog) తప్పిపోవడంతో ఢిల్లీకి చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి పాత్రా దంపతులు(Delhi couple) కుమిలిపోయారు. ఇద్దరూ చర్చించుకొని కీలక ప్రకటన చేశారు. తమ కుక్క ఆచూకీని(Dog missing) చెప్పేవారికి రూ.50వేల రివార్డును ఇస్తామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్లకార్డులపై రాసి చూపిస్తూ.. దిగిన ఫొటోలను వారు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే దీపయాన్ ఘోష్ దంపతులు ఆగ్రా టూర్‌కు వెళ్లారు. రెండు పెంపుడు కుక్కలను తమతో పాటు తీసుకెళ్లారు. ఆగ్రాలోని ప్రముఖ హోటల్‌లో బస చేశారు. నవంబరు 1న ఈ దంపతులు ఆగ్రా నుంచి ఫతే‌పూర్ సిక్రికి బయలుదేరారు.

ఈక్రమంలో ఆగ్రాలోని హోటల్‌ సిబ్బందికి రూ.2వేలు ఇచ్చి, తాము ఫతే‌పూర్ సిక్రి నుంచి తిరిగొచ్చే దాకా రెండు రోజుల పాటు కుక్కలను చూసుకోమని సూచించారు. నవంబరు 3న వారు ఆగ్రాలోని హోటల్‌కు తిరిగి రాగా.. ఒక కుక్క మాత్రమే అక్కడ ఉంది. మరొకటి తప్పిపోయింది. దీంతో కుక్క ఆచూకీని గుర్తించేందుకు 30 మందికిపైగా మనుషులను రంగంలోకి దింపారు. ఆగ్రాలోని హోటల్ చుట్టూ 30 కి.మీ ఏరియాను వారితో జల్లెడ పట్టించారు. షాజహాన్ గార్డెన్ వైపుగా కుక్క వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించామని ఆగ్రా ఏసీపీ సయ్యద్ ఆరిబ్ అహ్మద్ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ కుక్క నిర్దిష్ట లొకేషన్ దొరకలేదు.

Advertisement

Next Story