Australia : గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించబోతున్న తొలిదేశం మాదే : ఆస్ట్రేలియా

by Hajipasha |
Australia : గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించబోతున్న తొలిదేశం మాదే : ఆస్ట్రేలియా
X

దిశ, నేషనల్ బ్యూరో : గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించిన తొలిదేశంగా ఆస్ట్రేలియా నిలువబోతోందని ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన చర్యలకు అవసరమైన నిధుల కేటాయింపులో తాము నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని తెలిపారు.

అమెరికాలోని విల్మింగ్టన్‌లో క్వాడ్ కూటమి దేశాల సదస్సు సందర్భంగా నిర్వహించిన క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ ప్రజల జీవితాలను మార్చే గొప్ప సంకల్పం కోసం అమెరికా, భారత్, జపాన్‌లతో కలిసి పనిచేస్తున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Next Story

Most Viewed