- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిక్కీ హేలీకి ఊరట: వాషింగ్టన్‌లో తొలి విజయం
దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీకి ఊరట లభించింది. వాషింగ్టన్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక్కడ హేలీకి 62.9శాతం ఓట్లు రాగా, మాజీ అధ్యక్షుడు ట్రంపునకు 33.2శాతం ఓట్లు వచ్చాయి. 19 మంది ప్రతినిధులను హేలీ కైవసం చేసుకుంది. నామినేషన్ ప్రక్రియలో ఇది నిక్కీకి మొదటి గెలుపు. దీంతో వాషింగ్టన్‌లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హేలీ నిలిచింది. అయితే హేలీ తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో 40 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నారు. కేవలం ముగ్గురు డెలిగేట్‌లను మాత్రమే పొందగా.. ట్రంప్ 47 మందిని కైవసం చేసుకున్నారు.
కాగా, అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా సహా 8 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం గెలుపొందారు. తదుపరిగా మంగళవారం ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వాషింగ్టన్‌లో రిపబ్లికన్లు ట్రంపును తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు..2016లోనే ఇక్కడ జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు.