- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్‌లో భారీ భూకంపం..తీవ్రత ఎంతంటే?
దిశ, నేషనల్ బ్యూరో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్‌లోని ఎహైమ్, కొచ్చి ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 6.4తీవ్రతతో భూకంపం వచ్చినట్టు ఆ దేశ వాతావరణం సంస్థ తెలిపింది. జపనీస్ దీవులైన క్యుషు, షికోకులను వేరుచేసే జలసంధి బుంగో ఛానల్ కేంద్రంగా భూకంప కేంద్రం నమోదైనట్టు వెల్లడించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సునామీ హెచ్చరికలు సైతం అధికారులు జారీ చేయలేదు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎహైమ్‌లో ఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించిన ఇకాటా అణు కర్మాగారం, ఒక రియాక్టర్ పని చేస్తుండగా..దానికి ఎటువంటి నష్టం జరగలేదని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కాగా, భూకంపాలు సర్వసాధారణంగా సంభవించే ప్రాంతాల్లో జపాన్ ఒకటి. ప్రపంచంలో 6 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో ఐదో వంతు జపాన్‌లో ఉండటం గమనార్హం. 2011 మార్చి11న ఈశాన్య తీరంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతేగాక అత్యంత బలమైన సునామీ సంభవించింది. ఆ ఘటనతో అణు సంక్షోభం ఏర్పడింది. ఈ నెల 2వ తేదీన కూడా ఉత్తర జపాన్‌లోని ఇవాట్, అయోరీ ఫ్రిక్చర్లలో భూకంపం సంభవించగా..దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది.