ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటంతో 19 మంది మృతి

by Harish |
ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటంతో 19 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలో దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని తానా తోరాజా రీజెన్సీలో శనివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందారని, మరో ఇద్దరు తప్పిపోయారని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ప్రమాదంలో దక్షిణ మకాలేలో 4 గురు, మకాలే గ్రామాల్లో 15 మంది మరణించినట్లు స్థానిక విపత్తు సంస్థ అధిపతి సులైమాన్ మాలియా తెలిపారు. ఈ కొండచరియల క్రింద మరింత మంది ఉండవచ్చని అధికారాలు శిథిలాల క్రింద వెతుకుతున్నారు. తప్పిపోయిన ఇద్దరు కూడా కొండచరియల క్రింద ఉండవచ్చని అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

తానా తోరాజా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వాటి అంచున కోతకు గురై ఇళ్లపైన పడటంతో ఎక్కువ మంది మరణించారు. గత కొంత కాలంగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ద్వీపసమూహంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. గత నెలలో సుమత్రా ద్వీపంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 30 మంది మరణించారు. డిసెంబరులో జరిగిన ఘటనలో డజన్ల కొద్దీ నివాసాలు కొట్టుకుపోయాయి

Advertisement

Next Story