- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ,హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులు శుక్రవారం ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. పారిశుద్ధ్య సిబ్బందిలో పక్కన పెట్టిన వారిని విధులలోకి తీసుకోవాలని ఆందోళన చేశారు. అధికారులు స్పందించేవరకు పనులు చేసేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఒక్కరోజు రాకపోయినా మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. జ్వరంతో విధులకు రాకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామనడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పలువురు సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.
సిల్లీ రీజన్లు చెప్తున్నరు..
మున్సిపాలిటిలోని 28 వార్డులలో టీముకు 7గురు చొప్పున 4 టీములు పనిచేస్తున్నాయి. ఒక్కోసారి టీములో ఎక్కువమంది రాకపోవడంతో వార్డులలో చెత్త పేరుకుపోయి సిటిజన్ల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు విధులకు రాకుండా చాలా సిల్లీ రీజన్లు చెప్తున్నారు. కారణం లేకుండా నెలలో ఎక్కువ రోజులు విధులకు హాజరు కావడంలేదు. అందులో భాగంగా నలుగురు కార్మికులను విధుల నుండి కమిషనర్ పక్కన పెట్టారు. విధులకు హాజరైనప్పటికీ కొందరు వర్క్ సరిగా చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆందోళన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.
-జానకిరెడ్డి
శానిటరీ ఇన్స్ పెక్టర్