చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. 70 మొబైల్ ఫోన్లు రికవరీ

by Aamani |
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. 70 మొబైల్ ఫోన్లు రికవరీ
X

దిశ, నారాయణపేట క్రైమ్ : ఒకటికాదు రెండు కాదు ఏకంగా 70 మొబైల్ ఫోన్లు నారాయణపేట పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్ లను ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.మొత్తం 70 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా వీటి విలువ సుమారు రూ.10.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

ప్రజలు ఎవరు పాత మొబైల్ ఫోన్ల ను కొనరాదని ఎస్పి విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్ లను రికవరీ చేయడంలో కృషి చేసిన ఐటి కోర్ ఎస్సై వసంత, కానిస్టేబుల్ రమేష్ లను ఎస్పీ అభినందించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ లు శివ శంకర్, చంద్ర శేఖర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed