- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెనిఫిట్ షోలపై నిషేధం.. సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సీరియస్(Serious) అయ్యింది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్, బెన్ ఫిట్ షో(Benefit show)లకు పర్మిషన్ ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో టికెట్ల ధరల పెంపు(Increase in ticket prices)కు కూడా అనుమతి ఇవ్వమని ప్రభుత్వ తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్(Telangana Film Exhibitors Association) సభ్యులు సోమవారం సమావేశం అయ్యారు. సీఎం తీసుకున్న నిర్ణయాలపై చర్చించిన అనంతరం ప్రెస్ మీట్(Press meet) ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. అలాగే టికెట్ ధరలపై తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నామని వారు ప్రకటించారు. సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని, టికెట్ ధరల పెంపు వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటేనే ప్రజలు, ప్రేక్షకులు సినిమా చూడాటిని వస్తారని అన్నారు. అలాగే ఏపీలో కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరారు.