- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సర్పంచ్‌ను చూసి అందరూ నేర్చుకోవాల్సిందే.. ఎంత సింపుల్‌గా పొలం పనిచేస్తుందో..!
దిశ, కామారెడ్డి రూరల్ : సాధారణంగా గ్రామాల్లో కొందరు వార్డు మెంబర్‌గా గెలిస్తే చాలు తెగ బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతారు. ఏదో మంత్రి లెవల్లో ఫీలవుతుంటారు. కానీ, ఆమె ఏకంగా గ్రామ సర్పంచ్.. ఒక విధంగా చెప్పాలంటే గ్రామానికి సర్వం ఆమెనే.. సర్పంచ్‌గా ఆమె ఎంత చెబితే అంతా.. అధికారులు కూడా కిక్కురుమనకుండా ఉండాల్సిందే.. అలాంటిది రోటీన్ పాలిటిక్స్‌కు భిన్నంగా ఆ సర్పంచ్ మాత్రం సింపుల్‌గా తమ పొలంలో పనిచేస్తుంది. అప్పుడప్పుడూ ఉపాధి హామీ పనులకు కూడా వెళ్తుందట.. ఈ సింపుల్ అండ్ మహిళా సర్పంచ్ ఎక్కడున్నారంటే.. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఇస్రోజీ వాడీ గ్రామంలో కనిపిస్తారని చెప్పవచ్చును.
గ్రామానికి చెందిన మమత ఇస్రోజీ వాడీ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైంది. అయితే, సర్పంచ్ కాకముందు ఆమె ఓ సాధారణ వ్యవసాయ రైతు. ఓ వైపు వ్యవసాయ పనులు చేస్తూనే మరోవైపు ఉపాధి హామీ పనుల్లో సైతం పాల్గొనేది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజర్వేషన్ రావడంతో ఆమె పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందింది. పదవి రాకముందు ఎలా అయితే ఉందో.. ఇప్పుడు కూడా తాను గ్రామానికి సర్పంచ్ అనే గర్వం ఏ మాత్రం లేకుండా వ్యవసాయ పనులు చూసుకుంటూనే మరోవైపు సర్పంచిగా గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఓవైపు తన సొంత పనితో పాటు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సర్పంచ్ మమత మిగతా ప్రజాప్రతినిధులకు రోల్ మోడల్‌గా నిలిచింది.