- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో భర్త మృతి.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని భార్య ఆత్మహత్య
దిశ, సికింద్రాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కాటుకు మరో కుటుంబం బలైంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బౌద్ధ నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ(44) అనే వ్యక్తి బీఎస్ఎన్ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. ఈనెల 22వ తేదీన చాతిలో నొప్పి వస్తుండడంతో హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే లక్ష్మీనారాయణ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య రూపాదేవి(37) ఆయన మరణాన్ని తట్టుకోలేక పోయింది. అయితే, రెండు రోజుల క్రితం ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష చేయించుకోగా ఈరోజు ఉదయం ఆమెకు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. ఒకవైపు భర్త మరణం.. మరోవైపు తనకు కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రూపాదేవి ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా కారణంగా వారిద్దరూ మృతి చెందడంతో వారి ఇద్దరు పిల్లలు.. కూతురు సృతి(15), బాబు కార్తిక్(13) అనాథలు అయ్యారు. కరోనా మహ్మమారి వారి కుటుంబంలో విషాదం నింపింది.