- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రియుడితో ఆసీస్‌లో ఎంజాయ్… లాక్‌డౌన్‌తో..
దిశ, వెబ్‌డెస్క్: భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ముంబైలో జాబ్ చేస్తున్నాడు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. భర్త అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ వ్యవసాయం, మిగత కార్యక్రమాలు చూసుకొని వెళ్తాడు. భార్య ఒక్కతే ఫామ్‌హౌస్‌లో ఉంటోంది. ఇదే క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక ప్రియుడ్ని తీసుకొని విదేశాల్లో ఎంజాయ్ చేద్దామనుకున్న మహిళ పక్కా స్కెచ్ గీసింది. లేట్ చేయకుండా ఇంటర్ నేషనల్ ఫ్లైట్ ఎక్కి అక్కడే బుక్కై పోయింది. అసలేమైంది.. అక్కడే ఎందుకు ఉండిపోయింది…? లెట్స్ గో…
ఉత్తరప్రదేశ్ పిలిభిత్‌కు చెందిన దంపతులు… భర్తకు 45 ఏళ్లు, భార్యకు 35 ఏళ్లు. భర్త ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. లక్షల్లో శాలరీ. భార్య ఒక్కతే తమ సొంత గ్రామంలోనే వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ పనులు చూసుకుంటూ ఉంటోంది. భర్త రెండు మూడు నెలలకోసారి యూపీకి వచ్చి పది పదిహేను రోజులు ఉండి వెళ్తాడు.
ఇదే క్రమంలో ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంటికి వచ్చే వరకు కూడా ప్రియుడితోనే ఫామ్‌హౌస్‌లోనే ఉండేది. ఈనేపథ్యంలోనే ఓ సారి భర్త యూపీ వచ్చి.. మళ్లీ ముంబై వెళ్లిన కొద్దిరోజులకే మహిళ పక్కా ప్లాన్ వేసింది. భర్త ఇచ్చిపోయిన డబ్బులను విదేశాల్లో ప్రియుడితో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. తన భర్త పేరిట ప్రియుడికి పాస్‌పోర్టు తీయించి… జనవరి 6న ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది.
అయితే మార్చిలో ఇండియాకు తిరిగి రావల్సి ఉండగా… కరోనా ఎఫెక్ట్‌తో అక్కడే చిక్కుకు పోయారు. ఇటీవల ముంబై నుంచి వచ్చిన భర్తకు.. భార్య ఇంటి దగ్గర లేకపోవడంతో చుట్టు పక్కల వారిని అడిగి ఎక్కడికి పోయిందో తెలుసుకున్నాడు. అయితే తన పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో భార్య ప్రియుడు పాస్ పోర్టు తీసుకున్నాడేమోనన్న అనుమానంతో కావాలనే.. పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోగా…. అప్పటితకే అతడి పేరు మీద ఓ పాస్ పోర్టు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియాలో ప్రియుడితో కలిసి చిక్కుకు పోయిన మహిళ వందే భారత్ మిషన్‌లో ఆగస్టు 24న యూపీకి వచ్చింది.