- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రియుడితో కలిసి క్వారంటైన్‌లో మహిళా కానిస్టేబుల్
దిశ, వెబ్ డెస్క్: ఆమె ఓ మహిళ కానిస్టేబుల్.. సహచర సిబ్బందికి కరోనా సోకడంతో ఆమెను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ప్రియుడితో ఉండేందుకు అతన్ని అధికారులకు తన భర్తగా పరిచయం చేసి ఇద్దరు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంతలోనే ప్రియుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది.
తోటి పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అవివాహిత మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆమె ప్రైమరీ కాంటాక్ట్ గా తన ప్రియుడిని భర్తగా పేర్కొంటూ అధికారులకు తెలిపింది. దీంతో అధికారులు ఇద్దరిని కలిపి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. ఇంతలోనే కథ అడ్డం తిరిగింది.
భర్త మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో వివాహితుడైన కానిస్టేబుల్ ప్రియుడి భార్య విచారణ చేపట్టింది. ఆమెకు తన భర్త వేరే మహిళతో కలిసి క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలుసుకుని కలిసేందుకు పీటీసీకి వెళ్లింది. అయితే అక్కడి గార్డ్స్ ఆమెను అనుమతించలేదు. దీంతో తన భర్తపై బజాజ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు నుంచి అటే సిటీ పోలీస్ కమిషనర్‌ను కలిసి విషయాన్ని తెలిసింది.
దీంతో కమిషనర్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన డీసీపీ సదరు వ్యక్తిని మరొక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. మహిళా కానిస్టేబుల్, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వ్యక్తి ఇద్దరూ ప్రభుత్వ ప్రాజెక్టు పనిమీద గతేడాది అక్టోబర్‌లో కలుసుకున్నారు.