- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య సీక్రెట్ చాటింగ్.. భర్త సడన్ ఎంట్రీ.. చివరకు..
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాల కారణంగా కొందరి కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఆకర్షణ కారణంగా అపరిచిత వ్యక్తుల కోసం ప్రాణాలు తీస్తున్నారు లేదా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుపూర్ సమీపంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. పెరుమానల్లూర్ ఐయ్యం పాలయానికి చెందిన వెంకటేశన్.. భార్య రేవతి(32), ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.
వెంకటేశన్ రోజూ వారీ కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న క్రమంలో.. ఫేస్‌బుక్‌లో రేవతికి తిరువారూరుకు చెందిన ఓ వ్యక్తి పరిచయం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. రేవతి గంటల కొద్దీ ఆ వ్యక్తితో చాటింగ్ చేస్తుండటాన్ని భర్త వెంకటేశన్ ఓ రోజు గమనించాడు. వెంటనే భార్యను ఈ విషయంపై నిలదీశాడు. తెలియని వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదని.. హెచ్చరించాడు.
అయితే.. రేవతి మాత్రం భర్త మాటలను పట్టించుకోకుండా అతడితో అలాగే చాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే.. ఆదివారం కూడా రేవతి ఆ వ్యక్తితో చాటింగ్ చేస్తుండగా ఆమె భర్త చూశాడు. దీంతో కోపంలో వెంకటేశన్ భార్యను తిట్టి, చేయిచేసుకున్నాడు. భర్త ప్రవర్తనతో రేవతి తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అపరిచిత వ్యక్తితో పరిచయం.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి ఇద్దరు పిల్లలకు కన్నతల్లిని దూరం చేసింది.