ఆ రెండు ప్రాజెక్టులపై మీ వైఖరేంటి?

by Shyam |
ఆ రెండు ప్రాజెక్టులపై మీ వైఖరేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల డీపీఆర్‌లను, వాటి మీద ప్రభుత్వ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఆ రెండు ప్రాజెక్టులు అక్రమమైనవని, కృష్ణా నది పరివాహక ప్రాంతానికి వెలుపల ఉన్నాయని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించుకోడానికి ఎలాంటి అనుమతి లేదని, వాటిపై చర్యలు తీసుకోవాలని జూలై 31వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కృష్ణా బోర్డు మంగళవారం ఏపీ సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నది. ఆ రెండు ప్రాజెక్టులు వాడుకుంటున్న కృష్ణా జలాల వివరాలను సైతం తెలంగాణ ఆ లేఖలో పేర్కొన్నది. ఈ లేఖ ప్రతిని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ తన తాజా లేఖతో పాటు జత చేసింది. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమతి లేకుండానే పనిచేస్తున్న ప్రాజెక్టులు, నీటి తరలింపు తదితరాలన్నింటిపై వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఈ-ఇన్-సీని కోరింది.

Advertisement

Next Story