- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PKL : ప్రొ కబడ్డీ లీగ్‌కు కొత్త చాంపియన్.. హర్యానా స్టీలర్స్‌కు తొలి టైటిల్
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)కు కొత్త చాంపియన్. 11వ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ అవతరించింది. ఫైనల్‌లో పాట్నా పైరేట్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం పుణెలో జరిగిన ఫైనల్‌లో 32-23 తేడాతో హర్యానా విజయం సాధించింది. గతేడాది కూడా ఫైనల్‌లో అడుగుపెట్టినా విజేతగా నిలువలేకపోయింది. ఈ సారి అద్భుత ప్రదర్శనతో టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఫైనల్‌లో హర్యానా, పాట్నా జట్లు పాయింట్లు కోసం నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. అయితే, మొదటి నుంచి హర్యానానే కాస్త లీడ్‌లో కొనసాగింది. ఫస్టాఫ్‌లో ఆ జట్టు 15-12తో ఆధిక్యంలో నిలిచింది. రైడర్లు శివమ్, వినయ్, ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా విలువైన పాయింట్లు అందించారు. దీంతో సెకండాఫ్‌లోనూ ఆ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. చివరి 10 నిమిషాల్లో హర్యానా మరింత దూకుడు పెంచి వరుసగా పాయింట్లు సాధించింది. అలాగే, ఓ సారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసి సెకండాఫ్‌లో 17-11తో జోరు కనబర్చింది. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకున్న హర్యానా 9 పాయింట్లతో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో మాజీ చాంపియన్ అయిన పాట్నాకు నిరాశ తప్పలేదు. శివమ్ 9 పాయింట్లకుతోడు మొహమ్మద్ రెజా(7), వినయ్(6) రాణించి హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించారు.