Manmohan Singh : మన్మోహన్‌సింగ్ స్మారకం నిర్మాణానికి స్థలాలు రెడీ

by Hajipasha |
Manmohan Singh : మన్మోహన్‌సింగ్ స్మారకం నిర్మాణానికి స్థలాలు రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి, దివంగత మన్మోహన్ సింగ్ స్మారకం(Manmohan Singh memorial) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం(Centre Govt) ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో స్మారకం నిర్మాణానికి అనువుగా ఉండే పలు స్థలాల జాబితాను మన్మోహన్ కుటుంబానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పంపిందని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్, కిసాన్ ఘాట్‌ల సమీపంలో దాదాపు ఎకరం నుంచి ఎకరమున్నర విస్తీర్ణంలో ఉండే స్థలాలు మన్మోహన్ స్మారకం నిర్మాణానికి అనువుగా ఉంటాయని కేంద్రం ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా స్థలాలను ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తనిఖీ కూడా చేశారని తెలిసింది.

రాజ్‌ఘాట్‌కు సమీపంలోనే మన్మోహన్ సింగ్ స్మారక స్థలి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే రాజ్‌ఘాట్‌‌లోనే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ స్మారకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీ ప్రకారం.. ప్రముఖుల స్మారకాలను నిర్మించే స్థలాలను కేవలం ట్రస్టులకు కేటాయిస్తారు. ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసిన తర్వాతే.. దానికి ప్రభుత్వం కేటాయించే స్థలంలో మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణ పనులను మొదలుపెడతారు. మెమోరియల్ నిర్మాణానికి సంబంధించి స్మారక ట్రస్టుతో కేంద్ర ప్రభుత్వ ప్రజాపనుల విభాగం అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed