- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NSA: నేషనల్ స్కిల్ అకాడమీలో కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ(Skills Training) ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్కిల్ అకాడమీ(NSA) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటాతో సహా 100కు పైగా సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో(Software Courses) ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అయితే తెలంగాణ(TG) రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ శిక్షణ కోసం దరఖాస్తులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ మేరకు నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్(Sai Sriman) ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వారు ఈ నెల 9వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ https://www.nationalskillacademy.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీమాన్ వెల్లడించారు. పూర్తి వివరాలకు 9505800050 నంబర్ లేదా వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చని కోరారు.