- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IPOs: ఈ ఏడాది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కంపెనీల్లో అధిక లాభాలు, ఎక్కువ నష్టాలు పొందిన ఐపీఓలు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో(Stack Market) ఐపీఓల(IPO) హవా కొనసాగిన సంగతి తెలిసిందే. 2024లో మెయిన్ బోర్డు(Main Board) నుంచి మొత్తం 91 ఐపీఓకు రాగా.. సుమారు 1.59 లక్షల కోట్లు నిధుల్ని సమీకరించాయి. కాగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీల్లో హ్యుండాయ్ మోటార్స్ ఇండియా(HMI), స్విగ్గీ(Swiggy), ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NGE) వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. కానీ చిన్న కంపెనీ ఐపీఓలే ఈ ఏడాది అత్యధిక లాభాలను ఆర్జించడం విశేషం. కాగా 2024లో అత్యంత విజయవంతమైన ఐపీఓగా జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్(JCA) నిలిచింది.సుమారు 72 కోట్ల నిధుల్ని సమీకరించాలనే లక్ష్యంతో జనవరిలో దలాల్ స్ట్రీట్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్(Subscribe) చేసుకున్న ఇన్వెస్టర్లు(Investers) దాదాపు 309 శాతం లాభపడ్డారు. ఈ జాబితాలో 224 శాతంతో కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్(KHE), 192 శాతంతో ప్రీమియర్ ఎనర్జీస్(PE) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక అత్యధిక నష్టాలను చవిచూసిన ఐపీఓగా పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్(PV&S) నిలిచింది. మార్చిలో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కంపెనీ షేర్లు 44 శాతం క్షీణించాయి. ఆ తర్వాతి స్థానాల్లో క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(42%), వెస్ట్రన్ క్యారియర్స్(35%)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.