రేణుక ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు

by Naveena |
రేణుక ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు
X

దిశ,కనగల్లు: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు, కుటుంబ సభ్యులు సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార చార్యులు కలెక్టర్ దంపతులకు శాలువా కప్పి ఆలయంలోకి సాధారణంగా ఆహ్వానించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు మొక్కుబడి కళ్యాణం చేశారు. మార్గశిర మాసం చివరి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద కుంకుమార్చనలు, గోత్రనామాలు, అమ్మవారి కల్యాణాలు నిర్వహించరు. పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయం వద్ద వాహన పూజలు అధిక సంఖ్యలో భక్తులు చేయించుకున్నారు. ఆలయం వద్ద భక్తులు ముడుపులు కట్టి, అమ్మవారికి చీర, సారే, ఒడిబియ్యం, నైవేద్యంగా బోనాలు, మేకపోతులు కోడిపుంజులు సమర్పించారు. అర్చకులు ఆలయం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో జే.జయరామయ్య ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story