స్వామి వివేకానందుడు ప్రపంచ యువతకు స్ఫూర్తి

by Naveena |
స్వామి వివేకానందుడు ప్రపంచ యువతకు స్ఫూర్తి
X

దిశ, ఆర్మూర్ : వివేకానందుడు ప్రపంచ యువతకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ,తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వివేకానంద బోధనలు సూర్తిదాయకమని, భారతదేశంలో ఆయన జన్మించడం మన భారతీయులందరికీ అదృష్టమని, ఏకాగ్రతకు పట్టుదలకు ప్రవచనాలకు వివేకానందుడు కేంద్రమని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి పర్యటించారు. ఆదివారం రాత్రి నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో వివేకానంద ఏకరాతి శిల్పానికి పూలమాలవేసి వందన సమర్పణ చేశారు.అనంతరం చౌడమ్మ కొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, మాజీ జెడ్పిటిసి ఎర్రం యమున ముత్యం, సీనియర్ నాయకులు బాలగంగాధర్, మాజీ ఉపసర్పంచ్ భరత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగన్న, మనోజ్, కేజీ సురేష్, దారం సురేష్, రామారావు, వాసు బాబు, ప్రవీణ్, పాషా, రాజేందర్, నరేష్, సాగర్, శేఖర్, అశోక్, విజయ్, యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed