- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామకృష్ణ మఠంలో ఘనంగా కల్పతరు పర్వదినం వేడుకలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ రామకృష్ణ మఠంలో కల్పతరు పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కల్పతరు పర్వదినం సందర్భంగా విశేష పూజలు, భజనలు, హోమం, ఆలయ ప్రదక్షిణం, ఆరాత్రికంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగించారు. కల్పతరు పర్వదినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. 1886 జనవరి ఒకటిన పశ్చిమబెంగాల్‌లోని కాశీపూర్ ఉద్యానవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీరామకృష్ణ పరమహంస కల్పవృక్షంలా మారి భక్తుల కోరికలు తీర్చారని స్వామి బోధమయానంద తెలిపారు. నాటి నుంచి ప్రతియేటా రామకృష్ణ మఠం, మిషన్ కేంద్రాల్లో జనవరి ఒకటిన కల్పతరు దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.
Advertisement
Next Story