Drinker Sai: సినిమాలో మంతెనను కించపరిచేలా సీన్లు.. మూవీ డైరెక్టర్ పై దాడి

by Ramesh Goud |   ( Updated:2024-12-31 06:31:38.0  )
Drinker Sai: సినిమాలో మంతెనను కించపరిచేలా సీన్లు.. మూవీ డైరెక్టర్ పై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: డ్రింకర్ సాయి సినిమా(Drinker Sai Movie) డైరెక్టర్ పై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి(Dirctor Kiran Thirumala Shetti) దర్శకత్వంలో ఇటీవల డ్రింకర్ సాయి అనే సినిమా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ ను చూసేందుకు మూవీ టీం గుంటూరు(Guntoor)లోని శివ థియేటర్(Shiva Theatre) కు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ బయట మూవీ టీంతో కలిసి డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి ప్రెస్ మీట్(Press Meet) పెట్టారు. ఈ సినిమాలో ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు(Manthena Sathya Narayana Raju)ను కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆగ్రహానికి గురైన మంతెన ఫ్యాన్స్.. డైరెక్టర్ పై దాడికి తెగబడ్డారు. మీడియా సమావేశంలో ఉండగానే కిరణ్ తిరుమలశెట్టిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇంతలో అప్రమత్తమైన టీం డైరెక్టర్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మంతెన సత్యనారాయణను అవమాన పరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని మంతెన ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed