పిఠాపురంలో అమానుషం.. 24 గంటలైనా మృతదేహం అలాగే..!

by srinivas |   ( Updated:2025-01-01 14:22:54.0  )
పిఠాపురంలో అమానుషం.. 24 గంటలైనా మృతదేహం అలాగే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మనవతా విలువలు పడిపోతున్నాయి. కళ్ల ముందే మనిషి చనిపోయినా ఎవరూ స్పందించడంలేదు. చనిపోయిన ఒక రోజు గడిచి పరిసరాలంతా దుర్వాసన వస్తున్నా పట్టించుకోవడంలేదు. ఇలాంటి అమానుష ఘటన కాకినాడ జిల్లా(Kakinada District) పిఠాపురం(Pithapuram) నడిబొడ్డున జరిగింది. స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ పార్క్‌(Raja Rammohan Roy Park)లోని బెంచ్‌పై మంగళవారం ఓ వ్యక్తి మృతి(Person Died) చెందారు. అయితే బుధవారం వరకూ ఎవరూ పట్టించుకోంచుకోలేదు. దాదాపు 24 గంటల పాటు మృతదేహం అలాగే ఉంది. అంతేకాదు ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లింది. అటు కుటుంబ సభ్యులు కూడా స్పందించలేదు. దీంతో స్థానికులు అందోళనకు దిగారు. మానవతా విలువలు రోజు రోజుకు నశించిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు మృతదేహాన్ని ఆస్పత్రికి తలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed