- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బోటిక్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బట్టలు, మిషన్లు దగ్ధం
దిశ,పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె పట్టణం రెడ్డి నగర్ లో ఉన్న సుమంగళి బోటిక్ లో విద్యుత్ షాక్ సర్క్యూట్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. దీంతో బోటిక్ దుకాణంలోని క్లాత్, కుట్టిన బట్టలు, మిషన్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో కోటి రూపాయలు పైగా నష్టం నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. బాధితులైన సుష్మా, ప్రసాద్ రెడ్డిల కథనం మేరకు వారు ఇంట్లోనే సుమంగళి బోటిక్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. బుధవారం నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాపాఘ్ని నది సమీపంలో ఉన్న ఎద్దుల కొండపై జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్లారు. బోటిక్ దుకాణంలో పని చేస్తున్న సిబ్బంది దుకాణానికి భోజనం చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అగ్నిమాపక అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయాన్ని విచారిస్తున్నారు.