Keerthy Suresh: నా హృదయం భావోద్వేగాలతో నిండిన క్షణాలవే.. కీర్తి ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |
Keerthy Suresh: నా హృదయం భావోద్వేగాలతో నిండిన క్షణాలవే.. కీర్తి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) 2023లో ‘దసరా’(Dasara) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు కల్కి, సిరేన్, రఘుతాత వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోని తటిల్‌(Antony Thattil)ను పెళ్లి చేసుకుంది. గోవాలో డిసెంబర్ 12న చేసుకుంది. మొదట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఆమె ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత హనీమూన్‌కు కూడా వెళ్లకుండా ‘బేబీ జాన్’(Baby John) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. కానీ ఈ సినిమా విడుదలై ఆశించినంత రేంజ్‌లో హిట్ అందుకోలేక పోయింది. దీంతో కీర్తి సురేష్ కొద్ది కాలం పాటు నటనకు గ్యాప్ ఇచ్చి భర్తతో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, కీర్తి సురేష్(Keerthy Suresh) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

‘‘నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలాగే ఉంది. నా హృదయం భావోద్వేగాలతో నిండిన క్షణాలివి. ఎన్నో ఏళ్ల నుంచి మేము ఈ గొప్ప క్షణాల కోసం నిరీక్షిస్తున్నాము. అయితే మా గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మేమిద్దరం 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం. ఆంటోని(Antony Thattil) నాకంటే ఏడేళ్లు పెద్ద. మాది 15 ఏళ్ల ప్రేమ వివాహ బంధంగా మారింది. నా కెరీర్‌కు ఆంటోని చాలా సపోర్ట్ చేస్తాడు. నా భర్తగా జీవితంలోకి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed