- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థాంక్స్ టూ దిశ..! మీ వల్లే జాబ్ వచ్చింది..!
దిశ, భైంసా : డీఎస్సీ 2024 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ విభాగంలో నిర్మల్ జిల్లా సెకండ్ ర్యాంకర్ గా కుబీర్ మండలం చాతా గ్రామం వీరేష్ చదుల అర్హత సాధించగా... గత సంవత్సరం నవంబర్ 02 న నైట్ జరిగిన కౌన్సిలింగ్ కమ్ పోస్టింగ్ లో 1:1 లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో, జిల్లా సెకండ్ ర్యాంకు వచ్చిన..! జాబు మాత్రం రాలేదు..! రాత్రికి రాత్రే కౌన్సిలింగ్..!పోస్టింగ్ ప్రక్రియా..! 1:1 లిస్టు పెట్టకుండానే పోస్టింగ్లు..! అంటూ గత సంవత్సరం నవంబర్ 11న దిశ వెబ్ సైట్లో, పత్రికలో కథనం ప్రచురితం అయ్యాయి.
అది కాస్త పూర్తి వైరల్ గా మారి, సామాన్యులు, అధికారులు నాయకుల దృష్టికి చేరువయ్యింది. దీంతో ప్రముఖ పత్రికలు సైతం విరేష్ సమస్య పై కథనాలు ప్రచురించాయి. సమస్య పై విద్యాశాఖ డైరెక్టర్, అధికారులు స్పందించి లోపాలను సవరించి, గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఉమ్మడి ఖానాపూర్ మండల్ తండ్రా అంకేనా గ్రామానికి విరేష్ కి పోస్టింగ్ ఇవ్వడంతో తన సమస్య పై మొదట ప్రచురించిన దిశ భైంసాకి, పత్రిక యజమాన్యానికి వీరేశ్ థాంక్యూ..! చెప్తూ మీ వల్లే నా సమస్య విస్తృతంగా ప్రచురితమైందని, దాని తర్వాతే పలు మీడియాలో నా ఇంటర్వ్యూస్, కథనాలు రావడం మొదలయ్యయని ఆన్నారు.