- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అచ్చ తెలుగు అమ్మాయిలా రెడీ అయిన జాన్వీ కపూర్.. వావ్ క్యూట్ అంటున్న నెటిజన్లు(పోస్ట్)
దిశ, సినిమా: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ఈ భామ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘RC-16’ మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఈ భామ లంగా వోణి కట్టుకుని ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ అమ్మడు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసమే జాన్వీ సంప్రదాయకంగా రెడీ అయింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు.. అచ్చం శ్రీదేవిలా ఉన్నావని, వావ్ లంగావోణిలో క్యూట్‌గా ఉన్నావని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ ఫొటోలపై ఓ లుక్ వేసేయండి.