- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూ కబ్జాలు.. అక్రమ నిర్మాణాలు..
సిరిసిల్ల జిల్లాలోని ఆన్ సైన్డ్ భూకబ్జాలు, అక్రమ నిర్మాణాల పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సిరిసిల్లలో ప్రభుత్వ భూములను ఆ పార్టీ నేతలు కబ్జా చేసి అక్రమ పట్టాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, బీఆర్ఎస్ నేతలు చేసిన భూ భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తంగళ్లపల్లి మండలంలో మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు చేసిన మరో భూకబ్జా కోణం బహిర్గతమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో మేజర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ అయిన సారంపల్లి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాగా 464 సర్వేనంబర్‌లో 81.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2018లో గత ప్రభుత్వ సూచనలతో 26.33 ఎకరాల భూమిని గవర్నమెంట్ నిర్మాణాల కోసం అప్పటి తహశీల్దార్ కేటాయించారు. ఇదే భూమికి ఆనుకుని ఉన్న ఇద్దరు బీఆర్ఎస్ మండల స్థాయి నేతలకు పట్టా భూమి ఉంది. కేటీఆర్ సమీప బంధువుల అనుచరులైన వీరు వారి అండదండలతో గవర్నమెంట్ నిర్మాణాల కోసం కేటాయించిన భూమిలో దాదాపు 6 ఎకరాల నుంచి 8 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని స్థానిక తహశీల్దార్ తెలుపుతున్నారు.
దిశ, రాజన్నసిరిసిల్ల/తంగళ్లపల్లి : ఆన్ సైన్డ్ భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు అన్న చందంగా సిరిసిల్ల తయారైందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సిరిసిల్లలో ప్రభుత్వ భూములను ఆ పార్టీ నేతలు కబ్జా చేసి అక్రమ పట్టాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా బీఆర్ఎస్ నేతలు చేసిన భూ భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తంగళ్లపల్లి మండలంలో మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు చేసిన మరో భూకబ్జా కోణం బహిర్గతమై నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే సమగ్ర విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని స్థానిక తహశీల్దార్ తెలుపుతున్నారు.
ప్రభుత్వ భూమి కబ్జా, అక్రమ నిర్మాణాలు ?
జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో మేజర్ రెవెన్యూ గ్రామపంచాయతీ అయిన సారంపల్లి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాగా, 464 సర్వే నంబర్‌లో 81.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2018లో గత ప్రభుత్వ సూచనలతో 26.33ఎకరాల భూమిని గవర్నమెంట్ నిర్మాణాల కోసం అప్పటి తహశీల్దార్ కేటాయించారు. ఇదే భూమికి ఆనుకుని ఉన్న ఇద్దరు బీఆర్ఎస్ మండల స్థాయి నేతలకు పట్టా భూమి ఉంది. కేటీఆర్ సమీప బంధువుల అనుచరులైన వీరు వారి అండదండలతో గవర్నమెంట్ నిర్మాణాల కోసం కేటాయించిన భూమిలో దాదాపు 6 ఎకరాల నుంచి 8 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఆ భూమిలో ఆయా షెడ్లు నిర్మించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇద్దరు బీఆర్ఎస్ నేతల భూభాగోతంపై స్థానిక కాంగ్రెస్ నేతలు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా గ్రామంలో చాలా ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. జయంత్ తహశీల్దార్, తంగళ్లపల్లి..
మండలంలోని 464 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి కబ్జా అయినట్లు మా దృష్టికి రాలేదు. సర్వేయర్‌తో భూమిని సర్వే చేయించి, అధికారులతో సమగ్ర విచారణ జరిపిస్తాం. అనంతరం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.