ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ క్రికెటర్

by Jakkula Mamatha |   ( Updated:2025-01-01 14:19:50.0  )
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ క్రికెటర్
X

దిశ,వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్(Former Indian cricketer) వినోద్ కాంబ్లీ(Vinod Kambli) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇండియన్ జెర్సీని ధరించిన కాంబ్లే.. కర్ర సాయంతో నడుస్తూ కారు ఎక్కి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఇతర సమస్యలతో డిసెంబర్ 21న ఆసుపత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు పరీక్షల్లో తేలింది.

చికిత్సతో ఆయన ఆరోగ్యం ఒకింత మెరుగైందని వైద్యులు తెలిపారు. అయితే.. నూతన సంవత్సరం రోజున కాంబ్లీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్(Discharge) అయిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వినోద్ కాంబ్లీ(Vinod Kambli) సరిగ్గా నడవ లేకపోతున్నారని, కొందరు అతని చేయి పట్టుకొని కారులో ఎక్కించినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో కార్‌లో కూర్చున్న అనంతరం మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాంబ్లీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed