- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి : మంత్రి పొంగులేటి
దిశ, కూసుమంచి : రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా లోక్య తండా, కొక్య తండా గణ్య తండాలకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురామ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కూసుమంచిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలానికి చెందిన 64 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ. 18,80,500 లక్షల విలువ చేసే చెక్కులను, నేలకొండపల్లి మండలానికి చెందిన 42 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ. 16,01,500 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పడిన రెండో సంవత్సరంలో అభివృద్ధి మీద, ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టామని,రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా,ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇళ్ళకి దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే 30 లక్షల మంది యాప్ ద్వారా సర్వే చేశామని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తయిన వాటిని ఇస్తూ మిగతావి కూడా పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కానీ యువతకు ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం రైతులకు ప్రభుత్వం పక్షాన తీపి కబురు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ధర్మ తండాలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మాలదారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, కూసుమంచి మాజీ ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్ నాయక్, జూకూరి గోపాల్ రావు, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, గట్టుసింగారం మాజీ సర్పంచ్ చాట్ల పరశురాం, గొల్లపల్లి సుధాకర్ రెడ్డి, భారీ వీరభద్రం, మహమ్మద్ హఫీజుద్దీన్, భారీ శ్రీను,మంకేనా శ్రీనివాసరావు, సెట్ రామ్ నాయక్,రవి తదితరులు పాల్గొన్నారు.