గ్రేటర్ హైదరాబాద్ లో న్యూ ఇయర్​ డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?

by Naveena |   ( Updated:2025-01-01 14:26:23.0  )
గ్రేటర్ హైదరాబాద్ లో న్యూ ఇయర్​ డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?
X

దిశ, సిటీక్రైం : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్​లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో 2642 మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయారు. అలాగే 2642 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరందరీపై మోటర్ వెహికిల్ యాక్ట్ కేసులను నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 150 పోలీసు టీంలు ఈ తనిఖీల్లో పాల్గొని మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించారు. హైదరాబాద్ -1184, సైబరాబాద్- 839, రాచకొండ పరిధిలో 619 మంది ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడపారు. ఈ తనిఖీల్లో అత్యధికంగా 550 బీఏసి(బ్లడ్ అల్కాహాల్ కౌంట్) కౌంట్ నమోదైంది.100 మిల్లిగ్రాంల రక్తంలో 30 ఎంఎల్ అల్కాహాల్ దాటితేనే మనిషి మత్తులో అతను ఏం చేస్తున్నాడో తెలియన స్థితికి చేరుకుంటాడని మెడికల్ నివేదికల పరంగా స్పష్టంగా ఉంది. ఈ నేపధ్యంలో బీఏసీ లో 550 వచ్చిందంటే ఆ వాహనదారుడి పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా 30 ఎంఎల్ అల్కాహాల్ పరిమితి దాటిని వారంతా రోడ్ల పై వాహనాలు ఏలా నడిపిస్తారో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దీంట్లో భాగంగా పోలీసులు తాగిన మత్తులో ఏలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగి కొత్త సంవత్సరంలో కుటుంబాల్లో విషాదం నెలకొనకుండా తనిఖీలను పక్కగా చేయడంతో..2025 న్యూ ఇయర్ వేడుకలు గ్రేటర్ హైదరాబాద్ లో యాక్సిడెంట్ ఫ్రీ ఇయర్ మార్క్ ను నిలబెట్టుకుంది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో అత్యధికంగా 21,30 ఏండ్ల వయస్సు ఉన్న వారే అధికంగా మద్యం సేవించిన వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరందరీకి కోర్టు రూ.10 వేల జరిమానాతో పాటు..6 నెలలు జైలు శిక్ష వేస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Read More : New Year లెక్క తేలింది.. డిసెంబర్ 31న సర్కార్‌కు ఎన్ని రూ.కోట్ల ఆదాయం వచ్చిందటే..

Advertisement

Next Story

Most Viewed