మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపు

by Sridhar Babu |
మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపు
X

దిశ, గొల్లపల్లి : మండలంలోని మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి దేవస్థానానికి హుండీ రూపంలో 21,44,891 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత నెల 6వ తేదీ నుండి 29 వరకు జరిగిన దొంగ మల్లన్న జాతర సందర్భంగా భక్తులు స్వామివారి హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను బుధవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా దేవాదాయ డివిజనల్ ఇన్స్పెక్టర్ రాజమౌళి పర్యవేక్షణలో లెక్కించారు.

ఈ సందర్భంగా హుండీ ఆదాయం 21,44,891 రూపాయలు, 820 మిల్లి గ్రాముల బంగారం, 905 గ్రాముల వెండి వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈఓ విక్రమ్, ఫౌండర్ ట్రస్టి శాంతయ్య, గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, అర్చకులు రాజేందర్, శ్రీ లలిత సేవా ట్రస్ట్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed