NIN డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భారతీకులకర్ణి

by Bhoopathi Nagaiah |
NIN డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భారతీకులకర్ణి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కొత్త డైరెక్టర్ గా డా.భారతీ కులకర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె 20 సంవత్సరాలకు పైగా ఐసీఎంఆర్ లో సైంటిస్ట్ గా పనిచేశారు. గత మూడు సంవత్సరాలుగా న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో శిశు ఆరోగ్యం, పోషకాహార విభాగానికి హెడ్ గా పనిచేస్తున్నారు. ఈమె పూణే విశ్వవిద్యాలయం నుంచి పీడియాట్రిక్స్ లో పట్టా పొందారు. యూఎస్ఏలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బెర్గ్ నుంచి పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్శటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరల్ డిగ్రీ చేశారు. అలాగే మాతా శిశు సంరక్షణ, భారతీయ పిల్లల్లో పెరుగుదల, డెవలప్మెంట్, రక్తహీనత తగ్గించడం వంటి అంశాలపై పలు పరిశోధనలు చేశారు. ఆమె పరిశోధనలకు గానూ జాతీయ, అంతర్జాతీయ నిధుల ఏజెన్సీల నుంచి అనేక పరిశోధన గ్రాంట్లు పొందింది. అంతర్జాతీయ జర్నల్స్ లో130 కి పైగా ప్రచురణలు చేసింది. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఆమె ప్రసంగాలకు గాను పలు అవార్డులను అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed