- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిమింగలం ‘వాంతి’కి అక్షరాల రూ.5 కోట్లు.. దీని వల్ల ఏం లాభాలున్నాయంటే?
దిశ, వెబ్‌డెస్క్ : సముద్రంలో నివసించే జీవరాశుల్లో అతి ప్రమాదకరమైన జలచరం ఏదైనా ఉంటే ‘షార్క్ లేదా తిమింగలం’ అందరూ చెబుతారు. కానీ బరువు విషయానికొస్తే షార్క్స్ కంటే తిమింగలం భారీ ఆకారంలో ఉంటుంది. దీని బరువు ఆఫ్రికన్ మామోత్ ఏనుగులతో పోలిస్తే రెండింతలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. షార్క్స్ మనకు అప్పుడప్పుడు బీచుల్లో కనిపిస్తుంటాయి. కానీ తిమింగలాలు అలా కాదు. సముద్రం మధ్యలో లోతైన ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఎందుకంటే టన్నుల పరిమాణంలో ఉండే తిమింగలాలు సముద్రం ఒడ్డున సంచరించలేవట.. ఇకపోతే తిమింగలాలు ఆహారం తీసుకున్నాక కొన్ని సార్లు ‘వాంతి’ (Vomit)చేసుకుంటాయట.. అయితే, వీటికి బ్లాక్ మార్కెట్లో చాలా విలువ ఉంటుందని సమాచారం.
తాజాగా ముంబైలోని ఓ ఏరియాలో గుట్టుచప్పుడు కాకుండా తిమింగలం వాంతి (అంబర్ గ్రిస్) అమ్ముతున్నారని సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్రలోని బీడ్ లో నివసించే ఓ వ్యక్తి మార్కెట్లో రూ.5 కోట్లు విలువ చేసే 5 కేజీల తిమింగలం వాంతిని అమ్మేందుకు గోరేగావ్‌కు తీసుకొచ్చాడు. అతనిపై ముందే నిఘా ఉంచిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని నుంచి అంబర్ గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తిమింగలం వాంతిని ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన ‘మెడిసిన్స్, వ్యాక్సిన్స్ తయారీలో ఉపయోగిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు.
- Tags
- 5kgs