- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మాస్క్ ధర అక్షరాల రూ.5.70 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఫేస్ మాస్క్‌లు మన రోజువారీ వస్త్రధారణలో భాగంగా మారాయి. కాలక్రమేణా ఇవి ట్రెండీగా, ఫ్యాషన్‌గా కూడా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైనర్స్ బంగారం, వజ్రాలు పొదిగిన మాస్క్‌లను తయారు చేస్తున్నారు. ధనవంతులు వాటిని ధరించి వారి హోదాను చాటుకుంటున్నారు. ఇప్పుడు, పశ్చిమ బెంగాల్ సౌత్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త రూ. 5.70 లక్షల విలువైన కస్టమైజ్డ్ గోల్డ్ మాస్క్‌ని తయారు చేయించుకున్నాడు. ఈ మాస్క్‌ను కస్టమైజ్డ్ డిజైనర్ వస్తువులను తయారు చేసే బడ్జ్ బడ్జ్ పట్టణంలోని ఆభరణాల తయారు చేసే చందన్ దాస్ చేశాడు.
దాస్ 15 రోజుల్లో ఆ వ్యాపారవేత్త కోసం 108 గ్రాముల బంగారు మాస్క్ ను తయారు చేశాడు. కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ వేడుకల సందర్భంగా, ఆ వ్యాపారవేత్త బంగారు మాస్క్ ను ధరించాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా అదో మాదిరిగా చూడడంతో అతను ఆ మాస్క్‌ను తీసివేయవలసి వచ్చింది. రితుపర్ణ ఛటర్జీ అనే జర్నలిస్ట్ ఆ మాస్క్ ఫొటోలను ఆమె ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తూ.. “దీని ఉద్దేశ్యం ఏమిటి?” అని క్యాప్షన్ రాసింది. ఆ క్యాప్షన్ కు ఓ యూజర్ సమాదానం ఇస్తూ ఇలా రాశాడు.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పట్ల మానవత్వం, ఆందోళన లేకుండా.. ఇలా వారి స్టేటస్‌ను చూపించుకోవడం దారుణం అని అన్నాడు.
మాస్క్ ధరించిన వ్యాపారవేత్త మాట్లాడుతూ, తనకు ఆభరణాల పట్ల మక్కువ ఉందని, మెడలో బంగారు గొలుసులు, రెండు చేతులకు అనేక ఉంగరాలు ధరించినట్లు తెలిపారు. చివరి సంవత్సరం జూలైలో మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త కూడా రూ. 2.89 లక్షల విలువైన కస్టమైజ్డ్ గోల్డ్ మాస్క్‌ని కొన్నాడని గుర్తు చేశారు. ఆ మాస్క్ తయారీలో దాదాపు 55 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు.
What is the purpose of this? pic.twitter.com/Zy4MqIPNCZ
— Rituparna Chatterjee (@MasalaBai) November 10, 2021