రాష్ట్రంలో వీకెండ్​ లాక్​డౌన్​..! కాసేపట్లో అధికారిక ప్రకటన

by Anukaran |   ( Updated:2021-05-06 09:10:31.0  )
lockdown
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వీకెండ్​ లాక్​డౌన్​ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనిపై నిర్ణయం తీసుకుని స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. గురువారం ప్రగతిభవన్​లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్​… వీకెండ్​ లాక్​డౌన్​ అమలు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. వీకెండ్​ లాక్​డౌన్​ అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వానికి అక్షింతలు వేస్తోంది. నైట్​ కర్ఫ్యూ కూడా హైకోర్టు ఆదేశాలతోనే అమలు చేస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు కోర్టుకు సమాధానం చెప్పేందుకు రాష్ట్రంలో వీకెండ్​ లాక్​డౌన్​ను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నైట్​ కర్ఫ్యూపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు 23 రోజుల తర్వాత ప్రగతిభవన్​కు వచ్చిన సీఎం కేసీఆర్​ కరోనా పరిస్థితులపైనే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీకెండ్​ లాక్​డౌన్​ను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed