- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకుంటాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్ట పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు వారం రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసాయన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి నష్టమును అంచనా వేసి నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.
వాగులు వంకలు ఉప్పొంగిన సమయంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. వరద ఉధృతితో తెగిపోయిన వంతెనలు, రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడకుండా అధికారులు భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.