- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి..! సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్
దిశ ప్రతినిధి, వరంగల్ : ఈటలతో ఖాళీ అయిన మంత్రివర్గంలోని స్థానాన్ని వరంగల్ జిల్లా ముఖ్య నేతల్లోని ఒకరితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లుగా వాట్సాప్‌ల్లో ఓ మెస్సేజ్ వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల నుంచి ఇప్పటికే జిల్లా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు వచ్చినట్లుగా వాట్సాప్ మెస్సేజ్ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒకరికి మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంతో టీఆర్ ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంటోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భూ కబ్జాలకు పాల్పడ్డాంటూ విచారణలు జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెలను ఆరోగ్యశాఖ మంత్రిగా తప్పించిన విషయం తెలిసిందే. ఆయన పోర్టుఫోలియో మంత్రిగా కొనసాగుతున్నారు ప్రస్తుతం. ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిధిలోకి చేరింది. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.