Oral Sex - Kiss : ఓరల్ సెక్స్, డీప్ కిస్‌తో బ్రెయిన్ ఎఫెక్ట్.. ముగ్గురిలో ఒకరికి బెడ్‌రూమ్‌లోనే..

by Sujitha Rachapalli |
Oral Sex - Kiss : ఓరల్ సెక్స్, డీప్ కిస్‌తో బ్రెయిన్ ఎఫెక్ట్.. ముగ్గురిలో ఒకరికి బెడ్‌రూమ్‌లోనే..
X

దిశ, ఫీచర్స్ : కిస్, ఓరల్ సెక్స్, బెడ్‌రూమ్‌లో ఇంటిమసీలో భాగంగా చేసే పనుల వల్ల హెర్పెస్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది తాజా అధ్యయనం. దీనివల్ల చిత్తవైకల్యం(డిమెన్షియా -Dementia) కలుగుతుందని, మెదడుపై ఎఫెక్ట్ చూపుతుందని గుర్తించింది. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 (HSV-1) గురించి వార్నింగ్ ఇస్తున్నారు. వైరస్ ముక్కు నుంచి నాడీ వ్యవస్థకు ప్రయాణించగలదని.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. సెల్యులార్ ఎంజైమ్‌ను ఉపయోగించడం ద్వారా వైరస్ ప్రవర్తనా లక్షణాలను ఉత్పత్తి చేయగలదని చూపించిన మొదటి అధ్యయనం ఇదే. కాగా పరిశోధకులు ఏం చెప్తున్నారో మరింత తెలుసుకుందాం.

ఈ రీసెర్చ్‌కు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ దీపక్ శుక్లా బెడ్‌రూమ్‌లో వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని.. HSV-1 ఉన్న వ్యక్తి‌కి దగ్గరైనప్పుడు వైరస్ కణాలు ముక్కు ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మందికి HSV-1 సోకుతుంది. ఇది ప్రధానంగా నోరు, పుండ్లు, లాలాజలం లేదా చర్మ ఉపరితలాలలో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ ఓరల్ సెక్స్ ద్వారా జననేంద్రియ ప్రాంతానికి కూడా వ్యాపిస్తుంది. ఇది జననేంద్రియ హెర్పెస్‌కు కారణమవుతుంది. ఓరల్ హెర్పెస్ ఉన్న వ్యక్తి (పెదవుల చుట్టూ బొబ్బలు కలిగించవచ్చు) ముద్దు పెట్టుకున్నప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. జననేంద్రియ హెర్పెస్‌కు కారణమయ్యే HSV-1 కేసులు కూడా ఉన్నాయని.. అంటే ఓరల్ సెక్స్ సమయంలో సోకిన క్యారియర్ వైరస్‌ను వ్యాపింపజేసిందని తెలిపారు.

Next Story

Most Viewed