- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP Liquor Scam: మద్యం కుంభకోణంపై.. ఈడీ నజర్?

ఏపీ ప్రభుత్వం సీరియస్
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ లావు
నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణం
దిశ, డైనమిక్ బ్యూరో: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం కుంభకోణం (AP Liquor Scam) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంటులో ఆ వ్యవహారం గురించి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించిన తర్వాత రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు (Lavu sri krishna devarayalu) లోక్‌సభలో మాట్లాడారు. ఈ కుంభకోణం ఫలితంగా 2019_ 24 మధ్య కాలంలో రూ.18,860 కోట్ల నష్టం జరిగిందని లెక్కల సహా వివరించారు. పాదర్శకత లేని వ్యాపార పద్ధతుల ద్వారా వైసీపీ నేతలు 20వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఆ తర్వాత నిన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు హోమంత్రి అమిత్‌షాను (Home minister Amitsha) కలవడం రాజకీయ వర్గాల్లో ఆస్తక్తి రేపింది. హోంమంత్రి అమిత్‌షానే ఎంపీ లావును తన కార్యాలయానికి రప్పించుకుని మాట్లాడారని సమాచారం. ఈ కుంభకోణంపై పూర్తి వివరాలను ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం అమరావతికి చేరుకున్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబును (Cm Chandrababu) కలిసి ఢిల్లీల జరిగిన పరిణామాలపై వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మద్యం కుంభకోణంపై కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
ఏఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంటరవుతుందని సమాచారం. పార్లమెంటులో ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఇదే కోరారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో మద్యం కుంభకోణాలు ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీ మద్యం కేసులో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్అరెస్టు అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కవిత జైలుపాలయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ మాజీ సీఎం బాఘెల్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ ఎంటర్అయింది. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా మద్యం పాలసీకి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని బీజేపీ డిమాండ్చేస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీలోని మద్యం కుంభకోణం కలకలం రేపింది. వేలకోట్ల ఈ కుంభకోణంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. ఏదైనా కీలక పరిణామం జరిగితే తప్ప.. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగానే ఉన్నాయి. అయితే సీబీఐకి అప్పజెపుతారా..? సీఐడీకి కేసులు ఇస్తారా..? ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అవుతుందా..? అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ మంత్రులు ఇప్పుడు ఈ మద్యం వ్యవహారంలో ఏం జరుగుందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలే ఉన్నారని... వారికి ఉచ్చు బిగుసుకుంటోందని సోషల్‌మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.