చేతికొచ్చిన పంట ఎండడంతో అన్నదాత విలవిల..

by Sumithra |
చేతికొచ్చిన పంట ఎండడంతో అన్నదాత విలవిల..
X

దిశ, దేవరకద్ర : ఆరుగాలం కష్టపడి అప్పుచేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగునీరు సరిపోకపోవడంతో చేతికొచ్చిన వరి పంట ఎండిపోయి అన్నదాత విలవిలలాడుతున్న సంఘటన దేవరకద్ర మండలం పెద్ద గోపాలపురం గ్రామంలో చోటుచేసుకుంది. 20 రోజులు అయితే పంట చేతికొస్తుందని సమయంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోర్లు బావులు నుంచి నీళ్లు బంద్ కావడంతో వరి పంట ఎండిపోయింది. ఈ సందర్భంగా రైతు చింతకాయల నారాయణ మాట్లాడుతూ వర్షా కాలంలో వర్షాలు బాగా పడటంతో యాసంగిలో కూడా పంట పండుతుందని కౌలుకు తీసుకొని అప్పు చేసి రెండు ఎకరాల్లో వరి పంట వేశానని చేతికొస్తుందన్న సమయంలో బోరు లో నీళ్లు ఆగిపోవడంతో వరి పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు.

Next Story