Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

by Anil Sikha |
Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు
X

ట్వీట్ ​చేసిన డీసీఎం పవన్​ కల్యాణ్​

దిశ, డైనమిక్​ బ్యూరో: పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ.59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చానని గుర్తు చేశారు. సామర్లకోట-ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్​గడ్కరీకి, సీఎం చంద్రబాబుకు, ఆర్ అండ్‌ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story