Robinhood: రెండు రోజుల్లో విడుదల.. కీలక ప్రకటన చేసిన ‘రాబిన్‌హుడ్’టీమ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే! (ట్వీట్)

by Hamsa |   ( Updated:2025-03-26 08:41:58.0  )
Robinhood: రెండు రోజుల్లో విడుదల.. కీలక ప్రకటన  చేసిన ‘రాబిన్‌హుడ్’టీమ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే! (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ (robinhood).ఈ సినిమాను వెంకీ కుడుముల (venky kudumula) తెరకెక్కిస్తుండగా.. ఇందులో రాజేంద్ర ప్రసాద్ (rajendra prasad), వెన్నెల కిషోర్, (vennela kishor) దేవతత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్లెన్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ (ketika sharma) ఐటమ్ సాంగ్ చేసింది. అది దా సర్‌ప్రైజ్ అని సాగే పాట సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ‘రాబిన్‌హుడ్’సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.

అయితే ఈ మూవీని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని (Naveen Erneni), యలమంచలి రవిశంకర్ (Ravi Shankar)భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘రాబిన్‌హుడ్’చిత్రం మార్చి 28న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొద్ది మూవీస్ అన్నీ రిలీజ్ అయిన రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి.. అలాగే థియేటర్స్‌కు కూడా జనాలు రావడం లేదు ఇలాంటి టైమ్‌లో అవసరమా అని తిట్టిపోస్తున్నారు.

తాజాగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘రాబిన్‌హుడ్ సినిమా టికెట్స్ ధర పెంచినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అవన్నీ నిజమే కానీ అన్ని థియేటర్స్‌లో అవి వర్వించవు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నింటికి మాత్రమే టికెట్ ధరలు పెంచారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రేట్స్‌తోనే మా సినిమా మీ ముందుకు రాబోతుంది. కాబట్టి అందరూ మీ దగ్గరి థియేటర్స్‌లోకి వెళ్లి మా చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నాము. రాబిన్‌హుడ్ మార్చి 28న రాబోతుంది’’ అని కీలక ప్రకటన విడుదల చేశారు. దీంతో నెటిజన్ల విమర్శలకు చెక్ పడినట్లు అయింది. నితిన్ అభిమానులు కూడా సంతోష పడుతున్నారు.



Next Story

Most Viewed