పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పులు.. ఆ చాప్టర్లు తొలగింపు

by Jakkula Mamatha |   ( Updated:2025-04-28 04:10:10.0  )
పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పులు.. ఆ చాప్టర్లు తొలగింపు
X

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ముద్రించిన పుస్తకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో 4 మరియు 7వ తరగతి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త పాఠ్యపుస్తకాలు పొందనున్నారు. ఇందులో భాగంగా 7వ తరగతి సోషల్ పుస్తకంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. NCERT 7వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకాల్లో మొగల్స్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను తొలగించారు. వీటి స్థానంలో మగధ, మౌర్యులు, శాతవాహనులు, శుంగలు వంటి రాజ్యాలపై కొత్త చాప్టర్లను తీసుకొచ్చారు.

నూతన జాతీయ విద్యా విధానం, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్-2023లో ఈ కొత్త పుస్తకాలను రూపొందించారు. ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ:ఇండియా అండ్ బియాండ్, పార్ట్-1’ పేరుతో ఉన్న ఈ పుస్తకంలో మహాకుంభమేళా(Maha Kumbh Mela)తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. ఇదిలా ఉంటే.. పాత పాఠ్యపుస్తకంలో పర్షియన్ చరిత్రకారుడు మిన్హాజ్-ఇ-సిరాజ్, మొఘల్ చక్రవర్తి బాబర్ మరియు 'హిందూస్తాన్' మరియు 'హింద్' అనే పదాలను ఉపయోగించిన 14వ శతాబ్దపు కవి గురించి ప్రస్తావించగా, కొత్త పాఠ్యపుస్తకంలో 'భారత్' మరియు భారతదేశం యొక్క మూలాలు ప్రస్తావించబడ్డాయి.



Next Story